గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (09:19 IST)

నెలకు రూ.15 వేలు సంపాదించుకునే దినసరి కూలీకి రూ.14 కోట్ల పన్ను నోటీసు

bihar dailylabour
అతనో రోజువారీ కూలీ. నెలకు రూ.15 వేలు కష్టపడి సంపాదించుకుంటున్నాడు. కానీ, ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టిలో అతనో బడా వ్యాపారి.  అందుకే రూ.14 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ తాజాగా నోటీసు పంపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన రోహాస్త్‌కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి రోజుకూలీ. నెలకు రూ.12 నుంచి రూ.15 వేలు సంపాదిస్తాడు. అయితే, ఈయనకు తాజాగా ఐటీ శాఖ నుంచి ఓ నోటీసు వచ్చింది. దాన్ని చూసిన ఆయన విస్తుపోయాడు. నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి రూ.14 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. 
 
తనకు అందిన నోటీసులను చూసిన షాక్‌కు గురై కంగారుపడిపోయిన ఆయన.. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, తాను ఒక దినసరి కూలీనని చెప్పారు. బీహార్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లినపుడు అక్కడి వ్యాపారులు తమ పాన్, ఆధార్ కార్డులు తీసుకుంటారని, ఈ క్రమంలో ఆ వివరాలు ఎక్కడైనా దుర్వినియోగమై ఉండటంతో ఇలాంటి నోటీసులు వచ్చి పంపించివుంటారని వాపోతున్నాడు.