2023-24 కేంద్ర బడ్జెట్‌కు సర్వం సిద్ధం... ఐదోసారిగా నిర్మలా సీతారామన్...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోమారు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ బడ్జెట్‌ను మరికాసేపట్లే కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి కావడంగమనార్హం.
కాగాస ఆర్థిక మంత్రులు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చేతిలో ఎరుపు రంగు పద్దుల పుస్తకంతో దర్శనమిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తోంది. అయితే కరోనా దృష్ట్యా గత రెండేళ్లుగా కాగిత రహిత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో నిర్మల ఈసారి కూడా చేతిలో ట్యాబ్ సాయంతో బడ్జెట్ ప్రకటన చేయనున్నారు.
ఇక, 2023-24 బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత ముంగిట నిలిచారు. వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత ఆర్థికమంత్రుల జాబితాలో నిర్మల ఆరోస్థానంలో నిలుస్తారు. గతంలో ఈ ఘనత మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, యశ్వంత్ సిన్హా, చిదంబరం, అరుణ్ జైట్లీలు సొంతం చేసుకున్నారు.