1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (17:22 IST)

బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్

charless - rishi
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన ఆయన బ్రిటన్ కొత్త ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. దీంతో ఆ బ్రిటన్ రాజు చార్లెస్‌-3.. రిషి సునాక్‌తో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా విపక్ష లేబర్ పార్టీ నేతలు లేవనెత్తిన పలు అభ్యంతరాలను అధికార కన్జర్వేటివ్ పార్టీ తోసిపుచ్చింది. 
 
బ్రిటన్ చరిత్రలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి, అదీకూడా హిందూ మతానికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బ్రిటన్ రాజు చార్లెస్-3 నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందుకున్న రిషి సునక్.. బ్రిటన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన అతి త్వరలోనే తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు.