శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (08:31 IST)

ఏఐతో భారతీయుల్లో కొత్త టెన్షన్.. ఏంటది?

ఏఐతో భారతీయుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. భారత్‌లోని 74 శాతం మంది ఉద్యోగులు.. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోయే అవకాశం వుందని భావిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సర్వేలో వెల్లడి అయ్యింది. ఏఐ కారణంగా మానవ వనరులకు పని తగ్గుతుందని తద్వారా చాలా ఉద్యోగాలను వారు కోల్పోయే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
ఏఐ వల్ల భారీ మార్పులు వస్తాయని, భవిష్యత్‌ ఏఐ టెక్నాలజీతో కొత్త తరహా వృద్ధి సాధ్యమవుతుంది. అందుచేత కొత్త పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి తమ రోజువారీ పనుల్లో భాగంగా కొత్త విషయాలు నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్ నివేదిక తేల్చింది. 
 
ఏఐతో రోజవారీ ఉద్యోగ విధులు మరింత సులభంగా చేయవచ్చని మైక్రోసాఫ్ట్ కంట్రీ హెడ్ భాస్కర్ బసు వెల్లడించారు.