గురువారం, 8 జూన్ 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 27 మే 2023 (10:49 IST)

ముంబై ఇండియ‌న్స్‌పై గుజరాత్ విజయం.. చెన్నైపై ప్రతీకారం తీర్చుకుంటుందా?

Gujarat titans
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియ‌న్స్‌తో జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయ‌ర్ -2 పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ముంబై ఇండియ‌న్స్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపును నమోదు చేసుకుంది. 
 
మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 233 పరుగుల భారీ స్కోర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 171 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 
 
వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భారీ లక్ష్యం కావడంతో ముంబై ఓటమి తప్పలేదు. మే 28న ఇదే వేదికపై ఐపీఎల్ 2023 ఫైనల్ జరగనుంది. తొలి క్వాలిఫయర్ లో ఓడిన గుజరాత్, చెన్నైపై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది తెలియాల్సి వుంది.