శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (08:51 IST)

రాజస్థాన్‌పై అలవోకగా గెలిచిన గుజరాత్ టైటాన్స్.. యశస్వి రనౌట్‌పై ట్రోలింగ్

gujarat titans
ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించి.. రాజస్థాన్‌కు చుక్కలు చూపించింది. దీంతో వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. 
 
సూపర్ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రనౌట్ కావడం అభిమానులను నిరుత్సాహ పరిచింది. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రనౌట్‌పై ట్రోలింగ్ మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్ పవర్ ప్లే ముగిసే సమయానికి 50/1తో పటిష్ట స్థితిలోనే ఉంది. ఈ సమయంలో యశస్వి రనౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 17.5 ఓవర్లలో 118 పరుగులకు కుప్పకూలింది. శాంసన్‌ (30), ట్రెంట్‌ బౌల్ట్‌ (15) టాప్‌ స్కోరర్లు. రషీద్‌ 3, నూర్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్‌ 13.5 ఓవర్లలో 119/1 స్కోరు చేసి అలవోకగా ఛేదించింది.