సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (12:16 IST)

ఐపీఎల్ 2023 : ఆఖరి బంతికి సిక్స్ కొట్టలేకపోయిన ధోనీ... మళ్లీ ఓడిన సీఎస్కే

Dhoni
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లీగ్ పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించాలంటే చివరి బంతికి ఫోరు లేదా సిక్స్ కొట్టాల్సివుంది. కానీ క్రీజ్‌లో ధోనీ బంతిని బౌండరీకి తరలించలేకపోవడతో సీఎస్కే జట్టు ఓటమి పాలైంది. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ మూడు పరుగుల తేడాతో గెలుపొందింది. 
 
సీఎస్కే జట్టు కెప్టెన్‌గా 200 మ్యాచ్ ఆడిన ధోనీ.. తన జట్టును గెలిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. ఆఖరి ఓవర్‌లో 6 బంతులకు 21 పరుగులు అవసరం కాగా, ధోనీ రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశఆడు. కానీ, చివరి బంతికి 5 పరుగులు కావాల్సి రావడంతో ధోనీ మ్యాజిక్‌తో సీఎస్కే గెలుస్తుందని అందరూ ఊహించారు. కానీ, ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మ ఓ మంచి యార్కర్ వేయడంతో ధోనీ సింగ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 
 
దీంతో సీఎస్కే ఓటమి పాలైంది. ధోనీ ఎదుర్కొన్న 17 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌ల సాయంతో 32 పరుగులు చేయగా, మరో ఎండ్‌లో ఉన్న రవీంద్ర జడేజా 15 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌లకో 25 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్ఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.