గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మే 2023 (22:34 IST)

కేసీఆర్ సూపర్.. 247 రోజుల బాబు రికార్డ్ బ్రేక్

kcrao
తెలంగాణ సీఎం కేసీఆర్ రావు రికార్డు సృష్టించారు. తెలుగు రాష్ట్రానికి ఏకబిగిన అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన తెలుగు వ్యక్తిగా నిలిచారు. 
 
ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారిలో, అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న రికార్డు టీడీపీ అధినేత నేత చంద్రబాబు నాయుడు పేరిట ఉంది.
 
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు మూడు విడతల్లో మొత్తం 13 ఏళ్ల 247 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఏకబిగిన సీఎంగా ఎనిమిదేళ్ల 256 రోజులు ఉన్నారు. ఈ లెక్కన చంద్రబాబు రికార్డును కేసీఆర్‌‌ బ్రేక్‌ చేస్తున్నారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేళ్ల 221 రోజులు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్ల 111 రోజుల పాటు పదవిలో నిర్విరామం కొనసాగారు.