1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 26 మే 2023 (19:03 IST)

తెలంగాణలోనూ లిక్కర్ దందా.. ఎవరున్నారో తేల్చాలి

bandi sanjay
తెలంగాణలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లిక్కర్ దందా వెనుక ఎవరున్నారో తేల్చాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్‌కు ఖరీదైన లేబుల్స్ వేసి అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. 
 
దమ్ముంటే కేసీఆర్ దీనిపై విచారణకు ఆదేశించాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్  లో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదని సంజయ్ తెలిపారు.  లిక్కర్ స్కాంలో కవిత ఉందని సీఎం కేసీఅర్, కేటీఆర్‌కు కూడా తెలుసునని.. వాళ్లు అందుకే నోరు విప్పలేదన్నారు.