బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (16:22 IST)

4.23 కోట్ల బీర్లు తాగేసిన తెలంగాణ ప్రజలు.. ఒక్క నల్గొండలో..

beer
మే 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రికార్డు స్థాయిలో 4.23 కోట్ల బీర్లు తెలంగాణలో అమ్ముడుపోయాయి.  ఒక్క నల్గొండ జిల్లాలోనే 3.36 లక్షల కార్టన్ల బీరు తాగేశారట. ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ జిల్లా ఉంది. వేసవిలో బీర్లు విపరీతంగా అమ్ముడవుతాయన్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో కేవలం బీర్లతోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ.583 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. వేసవి తాపం ఇలాగే ఉంటే మే ఆఖరి వారం వరకు బీర్ల అమ్మకాలు రికార్డులు బద్దలయ్యే అవకాశం వుంది.