సంబంధిత వార్తలు
- రాత్రిపూట ఉక్రెయిన్ వైపు రష్యా క్షిపణుల వర్షం
- నిద్రిస్తున్న భార్య తలకు కరెంట్ వైర్ చుట్టి విద్యుత్ షాక్తో చంపేసిన భర్త
- 119 సీట్లలో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం.. కేసీఆర్ ధీమా
- "అడ్వెంచర్మ్యాన్" మెక్డొనాల్డ్ 7 రోజులు, ఏడు వింతలు
- తెలంగాణ ఓ వజ్రపు తునక : ఈ రోజు ఏపీ పరిస్థితి చూడండి... : సీఎం కేసీఆర్
తెలంగాణ వాసులకు శుభవార్త... నేడు రేపు వర్షాలు
సూర్య ప్రతాపంతో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడివుందని వెల్లడించింది. దీంతో ఈ రెండు రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇకపోతే, గురువారం నల్గొండలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 23.0 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు, భానుడి ప్రతాపంలో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు తోడవుతుండటంతో ఎండ తీవ్రత మరింతగా పెరిగింది. గురువారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు.
