మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 మే 2023 (12:29 IST)

తెలంగాణ ఓ వజ్రపు తునక : ఈ రోజు ఏపీ పరిస్థితి చూడండి... : సీఎం కేసీఆర్

cmkcr
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ సమయంలో అనేక మంది అవాకులు చెవాకులు పేలారని, ఇపుడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఓ వజ్రపు తునక అని సీఎం కేసీఆర్ అన్నారు. పైగా, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగింది. 
 
ఇందులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ మోడల్ శరణ్యమని ఔరంగాబాద్‌లో ఓ ఐపీఎస్ అధికారి స్వయంగా చెప్పారన్నారు. మనం చేసిన పనులను మనమే చెప్పుకోవడం లేదన్నారు. గుజరాత్ మోడల్ ఓ బోగస్ అని, దేశం తెలంగాణ మోడల్ కోరుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్‌కు బాస్ భగవద్గీత, వేదాలు అన్నీ తెలంగాణ ప్రజలే అన్నారు. కులం, మతంపై ఏ పార్టీ గెలవలేదన్నారు. 
 
తాము అన్ని వర్గాలను సమదృష్టిలో చూస్తున్నట్టు చెప్పారు. సిట్టింగ్‌లకే ఎక్కువ మంది టిక్కెట్ ఇస్తానని, తాను చెప్పినట్టు చేస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ 50 వేల మెజార్టీతో గెలుస్తారన్నారు. సింగరేణిని మొత్తం మనమే తీసుకుంటామంటే ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు.