సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (18:30 IST)

జేపీఎస్‌లకు షాకిచ్చిన తెలంగాణ సర్కారు.. విధుల్లోకి రాకపోతే..?

telangana state
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌)లకు తెలంగాణ సర్కారు షాకిచ్చింది. శనివారం విధుల్లోకి చేరకపోతే.. వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఉద్యోగాల రెగ్యులరైజ్‌ కోసం జేపీఎస్‌లు నిరవధిక సమ్మె చేపట్టారు.
 
సమ్మె కారణంగా విధుల్లో హాజరు కాని వారిపై తెలంగాణ సర్కారు సీరియస్ అయ్యింది. తద్వారా విధులకు హాజరుకాని వారికి ఉద్యోగాలు ఇక ఉండవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరోక్షంగా హెచ్చరించారు. 
 
శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విధులకు హాజరైన జేపీఎస్‌ల జాబితా పంపాలని సీఎస్‌ శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.