శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 మే 2023 (12:43 IST)

తెలంగాణాలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 61.68 శాతం, ద్వితీయ సంవత్సరంలో 63.49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. 
 
ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌.. ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లా చివరిస్థానంలో నిలిచినట్లు చెప్పారు. జూన్‌ 4 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మే 10 నుంచి మే 16 వరకు రీకౌంటింగ్‌, రీ వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని.. విద్యార్థులు, తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలిగించినట్లు మంత్రి చెప్పారు.