గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (17:42 IST)

విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

students
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. అంటే ఈ యేడాది పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఏకంగా 48 రోజుల పాటు రానున్నాయి. ఒకవేళ జూన్ నెలలో కూడా ఎండల తీవ్ర అధికంగా ఉంటే మాత్రం ఈ సెలవులను కూడా పొడగించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 
 
విద్యాశాఖ వర్గాల ప్రకారం 2023-24 విద్యా సంపత్సరానికిగాను వేసవి సెలవుల తర్వాత జూన్ 12వ తేదీన తిరిగి తెరుచుకుంటాయి. రాష్ట్రంలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరు నుంచి 9వ తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఏప్రిల్ 21 నుంచి 24వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యానంక నిర్వహించి, ఏప్రి్ 25వ తేదీన పరీక్షా ఫలితాలను వెల్లడిస్తారు. అదే రోజున విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి మార్కులు వెల్లడించి, వేసవి సెలవులను ప్రకటిస్తారని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.