గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (19:59 IST)

శుభ్‌మన్ గిల్‌ను పెళ్లి చేసుకుంటారా? సారా అలీఖాన్ సమాధానం

sara alikhan - shubhman gill
టీమిండియా స్టార్ ప్లేయర్ శుభమన్ గిల్‌ను పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బాలీవుడ్ నటి సారా అలీఖాన్ చెప్పింది.
 
నానమ్మ షర్మిలా ఠాగూర్ క్రికెటర్ మన్సూర్‌ను పెళ్లి చేసుకున్నట్టుగానే మీరు కూడా క్రికెటర్‌ను వివాహం చేసుకుంటారా అనే ప్రశ్నకు సారా సమాధానమిచ్చింది.
 
క్రికెటర్ శుభమన్ గిల్‌తో ప్రేమలో వున్న వార్తలపై దాట వేసింది. తన జీవిత భాగస్వామిని ఇంకా కలవలేదని, కలిశానని కూడా తాను అనుకోవడం లేదని సారా స్పష్టం చేసింది. 
 
తన మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా అతడితో జీవితాన్ని ప్రారంభిస్తానని తెలిపింది. 
 
అతడు క్రికెటర్, నటుడు, వ్యాపారవేత్త.. ఏ రంగానికి చెందినవాడైనా పర్వాలేదని, కాకపోతే తన విలువలను గౌరవిస్తే చాలని సారా అలీ ఖాన్ వెల్లడించింది.