ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (16:33 IST)

సార్.. పెళ్లికి పిల్ల దొరకలేదు.. ఓ పిల్లని వెతికిపెట్టండి మహాప్రభో : సర్కారుకు యువకుడి లేఖ

marriage
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ప్రభుత్వానికి లేఖ రాశాడు. తాను పెళ్లి చేసుకోవాలని వుందని, అందువల్ల తనకు ఓ అమ్మాయిని చూసిపెట్టాలంటూ ఆ యువకుడు ప్రభుత్వానికి లేఖ రాశాడు. అంతటితో ఆగకుండా నాలుగు నిబంధనలు కూడా పెట్టారు. అమ్మాయి సన్నగా ఉండాలి. చూడటానికి అందంగా ఉండాలి. నాయకత్వం లక్షణాలు తప్పకుండా  ఉండాలి. అమ్మాయి వయసు 30 నుంచి 40 యేళ్ల మధ్యలో ఉండాలి అని నిబంధనలు పెట్టారు. ఇంతకీ ఈ లేఖ రాసిన వ్యక్తి పేరు మహవర్. వయసు 40 యేళ్లు. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని దుబ్బి గంగద్‌వాడి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇంటి సమస్యల కారణంగా తమకు 40 యేళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదని, దయచేసి తనకోసం ఓ పిల్లని సెట్ చేయాలని కోరుతూ మహవర్ లేఖ రాశాడు. ఈ లేఖ చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమకు ఓ విచిత్రమైన అభ్యర్థన వచ్చిందని క్యాప్షన్ పెట్టి, అధికారిక ట్విట్టర్ ఖాతాలో లేఖలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింటి వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరోవైపు, ఈ లేఖపై విచారణ జరపాలని అధికారులు ఆదేశించారు.