1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (14:48 IST)

అందుబాటులోకి వచ్చిన ట్రాక్.. మళ్లీ పెట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

coromandel express train
షాలిమార్ - చెన్నై సెంట్రల్ స్టేషన్‌ల మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదం ఆ మార్గంలో నడిచే అనేక రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది రేయింబవుళ్లు శ్రమించి ప్రమాదం కారణంగా దెబ్బతిన్న రెండు ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. 
 
దీంతో మూడు రోజుల తర్వాత చెన్నై - షాలిమార్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు ఎస్ఎంఎస్ సందేశాలు వెళ్లాయి. సోమవారం ఉదయం 10.45 గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని ఐదో నంబరు ఫ్లాట్‌ఫాంపై నుంచి ఈ రైలు షాలిమార్‌కు బయలుదేరివెళ్లింది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా షాలిమార్ నుంచి చెన్నైకు మరో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కదిలింది.