ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (17:18 IST)

ప్రధాని మోడీకి లేఖ రాసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ

zelensky - modi
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య గత యేడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ అన్ని విధాలుగా నష్టపోయింది. ఈ యుద్ధం నష్టం నుంచి కోలుకోవాలంటే ఉక్రెయిన్‌ను ప్రపంచ దేశాలు ఆదుకోవాల్సి వుంది. ఈ నేపథ్యంలో తమకు భారత్ చేసే సాయాన్ని మరింతగా పెంచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ లేఖ రాశారు. మన దేశ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ మంత్రి ఎమినె జపరోవా ఈ లేఖను ప్రధాని మోడీకి, విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి అందజేశారు. 
 
రష్యా దురాక్రమణతో దెబ్బతిన్న తమ దేశాన్ని వీలైనంత మేరకు ఆదుకోవాలంటూ అన్ని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ ప్రాధేయపడుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారని, మందులు వైద్య పరికరాలు, తదితర అత్యవసర వస్తుువులను పంపించాలని ఆయన లేఖలో ఆయన కోరారు. ఈ లేఖను అందుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించి, ఉక్రెయిన్‌కు చేస్తున్న సాయాన్ని పెంచాలని సహాయ మంత్రికి సూచినట్టు సమాచారం.