1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (19:23 IST)

#WTC Final : పుంజుకున్న భారత బౌలర్లు - ఆసీస్ 469 ఆలౌట్

india team
లండన్ వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ టెస్ట్ సిరీస్‌ ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు రెండో రోజున తమ సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 327/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. భారత్ బౌలర్లు పుంజుకోవడంతో మరో 142 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. 
 
ట్రావిస్ హెడ్ 174 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్‌‌తో సాయంతో 163, స్టీవ్‌ స్మిత్ 268 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 121 పరుగులు చేసి నిలకడగా ఆడి శతకం సాధించాడు. అలెక్స్‌ కేరీ 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 48, డేవిడ్ వార్నర్ 60 బంతుల్లో 8 ఫోర్లు 43 రన్స్ చొప్పున పరుగులు చేశారు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్నంత సేవు దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 4, శార్దూల్  ఠాకూర్‌ 2, షమి 2, జడేజా ఒక వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.