బుధవారం, 11 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (15:56 IST)

ఐపీఎల్‌లో మరోసారి ఫిక్సింగ్ ఉదంతం.. సిరాజ్‌కు ఫోన్‌చేసి?

mohammed siraj
ఐపీఎల్‌లో మరోసారి ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి సిరాజ్‌కు ఫోన్‌చేసి జట్టులోని అంతర్గత విషయాలు చెబితే భారీ మొత్తంలో డబ్బులిస్తామంటూ ఎర చూపాడని ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ విషయాన్ని సిరాజ్ బీసీసీఐ, అవినీతి నిరోధక విభాగానికి తెలిపాడు. దీంతో బిసిసిఐ వేగంగా చర్యలు చేపట్టింది. సిరాజ్‌ను సంప్రదించింది బుకీ కాదు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ హైదరాబాద్‌ డ్రైవర్‌ అని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే అతడు బెట్టింగ్ ద్వారా చాలా డబ్బును పోగొట్టుకున్నాడని బీసీసీఐ అధికారులు తెలిపారు. 
 
సిరాజ్‌ ఇచ్చిన సమాచారంతో తక్షణమే చర్యలు తీసుకున్నామని.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వ్యక్తిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారని బీసీసీఐ అధికారులు తెలిపారు.