గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (15:02 IST)

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ తొలి వికెట్.. అభినందనల వెల్లువ

Sachin Tendulkar
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. తన తొలి ఐపీఎల్ వికెట్ తీసిన తర్వాత అతడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై-హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
నిన్నటి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు చివరి ఓవర్‌లో 20 పరుగులతో ఆడింది. 20వ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదో బంతికి వికెట్‌ తీసి గేమ్‌ను ముగించాడు. 
 
అర్జున్ టెండూల్కర్ ఇప్పటికే కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, నిన్న తొలి వికెట్ తీయడంతో సచిన్‌తో పాటు పలువురు ప్రముఖులు అతడిని కొనియాడుతున్నారు.