తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. మేం వచ్చాం.. ఉప్పల్‌కి రండి..
ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా టీమ్ ఇటీవల షేర్ చేసిన వీడియోలో, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడాడు. "మేం వచ్చాం.. ముంబై ఇండియన్ ఫ్యాన్స్.. ఉప్పల్‌కి రండి" అంటూ తెలుగులో అభిమానులను పలకరించారు రోహిత్ శర్మ. ఈ వీడియోకు భారీ షేర్లు వచ్చాయి. ముంబై మనిషి అయినా తెలుగులో రోహిత్ శర్మ అద్భుతంగా మాట్లాడాడని తెలుగు జనం కితాబిస్తున్నారు.
ఇకపోతే.. ఈ స్టార్ క్రికెటర్‌కు హైదరాబాద్, విశాఖపట్నంలలో బంధువులు ఉన్నారు. దీంతో తెలుగు మాట్లాడే సమాజంతో ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి మరియు ఈ గేమ్‌లో విజేత ఆరు పాయింట్లతో పట్టికలో ముందుకు సాగుతారు.