శుక్రవారం, 12 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (19:16 IST)

కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి లకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సన్మానం

chandrabose, james, keeravani
chandrabose, james, keeravani
ఆర్.ఆర్.ఆర్. లోని నాటు నాటు పాటతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయిన కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి లకు విదేశాల్లో సన్మానం జరిగింది. ఇక హైదరాబాద్ వచ్చాక  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సన్మానం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అంతా ఏకమయి చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ పూనుకున్నాయి. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు డి.సురేష్ బాబు పరిశీలిస్తున్నారు. 
 
ఆదివారం 9వ తేదీ  సాయంత్రం 6 గంటలకు  శిల్ప కళావేదిక రంగం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలు MM కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్, కార్తికేయ చిత్ర టీం హాజరు కానున్నారు. ఈ వేడుకలను తెలుగు చలనచిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్‌ల అందరిని  సాదరంగా ఆహ్వానిస్తున్నాము అంటూ ప్రకటించారు.  ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ హాజరుకానున్నారు.