1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sukumar is promoting Where is Pushpa ?

వేరీజ్‌ పుష్ప అంటూ ప్రచారం చేస్తున్న సుకుమార్‌!

Sukumar pushpa2 edtting room
Sukumar pushpa2 edtting room
పుష్ప సీక్వెల్‌ ది రూల్‌ అనే సినిమాను మొదలు పెట్టిన సుకుమార్‌ ఇప్పుడు వేరీజ్‌ పుష్ప అంటూ ప్రచారం చేస్తున్నాడు. ఇది అన్ని భాషల్లోనూ చిన్న గ్లింప్స్‌గా విడుదల చేయడంతో మంచి అప్లాజ్‌ వచ్చింది. ముందునుంచి అనుకున్నట్లునే ఈరోజు అల్లు అర్జున్‌ పుట్టినరోజు కావడంతో ఈ సాయంత్రం స్పెషల్‌ టీజర్‌ విడుదల చేయనున్నారు. 
 
గతంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్నది రాజమౌళి ప్రచారం చేసి ఆకట్టుకున్నాడు. అదే బాటలో పుష్ప ఎక్కడున్నాడంటూ.. చిత్రంగా పబ్లిసిటీ చేస్తున్నాడు సుకుమార్‌. ఈ టీజర్‌ గురించి తన ఎడిటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ గురించి చర్చిస్తున్న పిక్‌ను పోస్ట్‌ చేశాడు. ఇందులో భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ వుందన్నమాట. రష్మిక మందన్న, సాయి పల్లవి కూడా నటిస్తున్న ఈ సినిమాలో ఫయాజ్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీమూవీస్‌ నిర్మిస్తోంది. 
 
About Writer
డీవీ
తర్వాతి కథనం
విజయ్ భాస్కర్ నా ఫేవరేట్ డైరెక్టర్ : శివాని రాజశేఖర్