గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (16:13 IST)

నాని కెరీయర్‌లో బెస్ట్‌ పెర్‌ఫార్మెన్‌ : రాజమౌళి కితాబు

SS Rajamouli twitter
SS Rajamouli twitter
ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ‘ఈగ’ సినిమాను నాని చేశాడు. ఇప్పుడు నాని చేసిన దసరా సినిమాను చూసి ప్రభాస్‌, మహేష్‌బాబు, యశ్‌ వంటి పలువురు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దసరా గురించి స్పందిస్తూ.. హార్ట్‌ టచింగ్‌ లవ్‌ స్టోరీ ఇందులోవుంది. రగ్గ్‌డ్‌ లాండ్‌ స్కేప్‌, రా క్యారెక్టర్లు అన్నీ ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల చూపించారు. నాని కెరీయిర్‌లో బెస్ట్‌ పెర్‌ ఫార్మెన్స్‌ సినిమా. కీర్తి సురేష్‌ నల్లేరుమీద నడకలా పాత్రలో ఒదిగిపోయింది. 
 
ఇందులో నటించిన ప్రతి నటుడి అభినయం అద్భుతం. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఫస్ట్‌ క్లాస్‌గా వుంది. అన్నింటికంటే బేక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కు ప్రత్యేక అభినందనలు. దసరా టీమ్‌కు సక్సెస్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాజమౌళి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇందుకు నాని ప్రతిస్పందిస్తూ, మీరు మా సినిమాను చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం జీవితంలో మర్చిపోని అణునుభూతి అన్నారు.