సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-06-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా...

Capricorn
మేషం :- కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది.
 
వృషభం :- మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్నిఇస్తుంది. ప్రయాణాలు, ముఖ్యమైన చెల్లింపులలో మెలకువ వహించండి. వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు.
 
మిథునం :- స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎందుర్కొంటారు. సాహస ప్రయత్నాలు విరమించండి. మీ సంతానం, ఆప్తుల కోసం ధనం విపరీతంగా వ్యయంచేస్తారు. ఆదాయం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. విహారయాత్రలకు అవకాశాలు ఉన్నాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
కర్కాటకం :- మీ యత్నాలకు ఆత్మీయులు సహాయ సహకారాలు అందిస్తారు. బంధు మిత్రుల రాకపోకలు అధిక ఖర్చులు, మీ అంచనాలు దాటుతాయి. మొక్కుబడులు, దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు.
 
సింహం :- కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. రాబోయే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకుంటారు.
 
కన్య :- వ్యాపారాల్లో పోటీని తట్టుకోవటానికి బాగా శ్రమించాలి. సంగీత, సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమ విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ ఓ త్యాగం చేయాల్సి వస్తుంది. స్త్రీలకు అకాల భోజనం వలన ఆర్యోగంలో ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
తుల :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొత్త వ్యాపారాల ఆలోచనమాని చేస్తున్న వాటిపై దృష్టిపెట్టండి. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సోదరి, సోదరుల మధ్య మనస్ఫర్థలు తలెత్తుతాయి.
 
వృశ్చికం :- కానివేళలో మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. శతృవులపై విజయం సాధిస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించటంమంచిది. సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. పాత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
 
ధనస్సు :- మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలు అందరి యందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
మకరం :- పాత బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఆదాయపు లెక్కలు, తేడాలు అప్పటికప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.
 
కుంభం :- బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. విదేశీ చదువుల యత్నంలో విద్యార్థులు సఫలీకృతులవుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. మీఉన్నతిని చాటుకోవటానికి ధనం విపరీతంగా వ్యయం చేయవలసివస్తుంది. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు.
 
మీనం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.