సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-06-2023 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం..

Virgo
మేషం :- ఆర్ధికాభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. అధికారులకు ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికమవుతాయి. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. స్త్రీలకు నడుము, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
వృషభం :- రిప్రజెంటేటివ్‌లకు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. దైవ సేవా, పుణ్య కార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి.
 
మిథునం :- ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. టెక్నిక్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఖర్చులు మీరు ఊహించిన దానికంటే మరింతగా పెరుగుతాయి. 
 
కర్కాటకం :- విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానం ప్రేమ వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు అయిన వారి నుంచి ఆహ్వానం అందుతుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.
 
సింహం :- ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కుటుంబ విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఊహించని విజయం మిమ్మల్ని విజయంతో ముంచెత్తుతుంది. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికులు తప్పవు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
తుల :- దంపతుల మధ్య సంతానం విద్యా విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అసలైన శక్తి సామర్థ్యన్ని మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. తలచిన కార్యక్రమాలు, వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
 
వృశ్చికం :- అనుకోని అతిధుల ద్వారా ముఖ్య విషయాలు గ్రహిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం. ఏసీ, కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. పాత రుణాలు తీరుస్తారు.
 
ధనస్సు :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కళ్ళు, నడుము నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కుంటారు. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకంమాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
మకరం :- అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. మానసిక చికాకులు, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా సర్దుకుంటాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు.
 
కుంభం :- మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి.
 
మీనం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలు షాపింగులోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.