ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

05-06-2023 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం..

Cancer
మేషం :- రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యంలో మెళకువ వహించండి. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం.
 
వృషభం : శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసివస్తుంది. ఖర్చులు అధికమైనా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
మిథునం :- రాజకీయనాయకులు తరచూసభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దేవలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేసి మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ విషయంలో ఏకాగ్రత చాలా అవసరం. 
 
కర్కాటకం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. స్త్రీలకు బంధువర్గాలు, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. విధినిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగస్తులు చిక్కుల్లో పడతారు. ప్రముఖుల కోసం ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
సింహం :- ఉద్యోగాల్లో ఊహించిన మార్పులు, ఆదాయాభివృద్ధి ఉంటాయి. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. స్థిరాస్తిని అమ్మటానికి చేయుయత్నాలు వాయిదాపడతాయి. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు.
 
కన్య :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన వంటి చికాకులు అధికమవుతాయి. మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఏదైనా అమ్మటానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి.
 
తుల :- నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. మీ కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృశ్చికం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు పనులు వాయిదాపడటం మంచిదని గమనించండి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- స్త్రీలపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మీ జీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి.
 
మకరం :- వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీమాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలు షాపింగులో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
 
కుంభం :- ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులే అనుకూలిస్తాయి. కుటుంబ విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. సోదరుల మధ్య చిన్న చిన్నకలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు.
 
మీనం :- చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగిన నష్టాలు ఉండవు. వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. కుటుంబ సాఖ్యం, వాహనయోగం వంటి శుభఫలితాలు ఉంటాయి.