శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-05-2023 బుధవారం రాశిఫలాలు - గాయిత్రి మాతను ఆరాధించిన శుభం...

astro3
మేషం :- కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. మీ కళత్ర వైఖరి మీకు చికాకు కలిగించగలదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అప్రమత్త అవసరం. ఎలక్ట్రానికల్, ఇన్వెర్టెర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమాంచాల్సి ఉంటుంది. మీ సంతానం ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి.
 
మిథునం :- దైవ, సేవా కార్యాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు విషయంలో పునరాలోచన అవసరం. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం :- విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. రాబడికి మంచి ఖర్చులు అధికమవుతాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
సింహం :- విలాసాల కోసం ధన వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శుభదాయకం. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కన్య :- ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. విందు, వినోదాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు ఆరోగ్య భంగం, వైద్యసేవలు అవసరమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
తుల :- రాజకీయాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికం. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేకశ్రద్ధ వహిస్తారు. దుబారా వ్యయం అధికంగా ఉంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- రాజకీయనాయకులు తమ వాగ్దానాలను నిలబెట్లుకోలేక పోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. గృహవాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి.
 
ధనస్సు :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాహనం నిదానంగానడపటం క్షేమదాయకం. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. స్త్రీలకు నరాలు, వెన్నెముక, దంతాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
మకరం :- రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. బంధుమిత్రుల కారణంగా మీ కార్యక్రమాల వాయిదా పడతాయి. నూనె, మిర్చి, పసుపు, ఉల్లి, ఎండుమిర్చి, ధాన్యం వ్యాపారస్తులకు అభివృద్ధి.
 
కుంభం :- అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. చేతి వృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఖర్చులు అధికమవుతాయి.
 
మీనం :- ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు చేజారిపోతాయి. బంధువులు మీ చిత్తశుద్ధిని శంకించే ఆస్కారముంది. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లోవారికి ఆందోళన తప్పదు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతులు, బదిలీలకు కొంతమంది అవరోధం కల్పిస్తారు.