బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-05-2023 సోమవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం...

astro1
మేషం :- అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. రాజకీయ నాయకులు తరచూ సభలు సమావేశాలలో పాల్గొంటారు. ఉన్నవాళ్ళతోనే సుఖంగా ఉండగలుగుతారు. పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆకర్షితులవుతారు.
 
వృషభం :- వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. మొండిబాకీలు వసూలవుతాయి. సన్నిహితులు నుంచి ఆకర్షణీయమైన కానుకలు అందుకుంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేసిన సాయానికి సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మిథునం :- గృహోఎపకరణాలు కొనుగోలు చేస్తారు. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక, ఇసుక రంగంలో వారికి కలిసివచ్చే కాలం. ఫైనాన్సు చిట్ ఫండ్ వ్యాపారస్థులకు నూతన ఉత్సాహం కానవచ్చును. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. కొబ్బరి, పానీయ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం.
 
కర్కాటకం :- స్త్రీలకు నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. సంతానం కారణంగా దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి. ఆడిటర్లకు ఇంజనీరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
 
సింహం :- సామాజిక, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. కొబ్బరి, చల్లని పానియాలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విడిపోవాలని నిర్ణయించుకున్న వారితో విడిపోతారు. ఎంతో కొంత పొదుపు చేయడం మంచిది. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు.
 
కన్య :- పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు. కొత్త ప్రదేశ సందర్శనలు, దైవదర్శనాలు ఉత్సాహాన్నిస్తాయి. కార్యాలయంలో సమస్యలు సమసిపోతాయి. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.
 
తుల :- దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా సాగుతాయి. వైద్యులకు సంతృప్తి, ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మిత్రుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. విదేశాస్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
ధనస్సు :- వృత్తుల, ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులు మన్ననలు పొందుతారు. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ ఆశయసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి.
 
మకరం :- స్త్రీలకు ఇతరుల వాహనం నడపటంవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆహార, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలను అధికమిస్తారు. మొహమ్మాటాలకు పోయి దుబారా ఖర్చులు చేయకండి. ఆత్మీయుల నడుమ కానుకలిచ్చి పుచ్చుకుంటారు.
 
కుంభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
మీనం :- వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఆహార, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. బంధువుల రాకవల్ల ఊహించని సమస్యలెదురవుతాయి. విద్యాసంస్థలలోని వారికి అనుకూలమైనకాలం. బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళుకువ అవసరం.