శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-05-2023 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...

Weekly astrology
మేషం :- కొరియర్ రంగాల వారికి పనిభారం తప్పదు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడక తప్పదు. ఏ విషయంలోను ఒంటెత్తుపోకడమంచిది కాదు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలోను మీరే నిర్ణయం తీసుకోవటం మంచిదని గమనించండి.
 
వృషభం :- వృత్తి, వ్యాపారాలకు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. రుణాలు తీరుస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
మిథునం :- ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర సందర్శనలు పాల్గొంటారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసివస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పనిభారం బాగా పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
సింహం :- ఎగుమతి, దిగుమతులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్త్రీలకు చుట్టు ప్రక్కల వారి నుండి ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో సాన్నిత్యం పెంచుకుంటారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలోనూ, సభా కార్యక్రమాలలోను మెళుకువ, ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత చాలా అవసరం.
 
కన్య :- వృత్తి వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సంస్థల నుంచి పారితోషికం అందుతాయి. సాహస ప్రయత్నాలు విరమించడం మంచిది. సంఘంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు.
 
తుల :- హోటల్, తినుబండ రంగాల్లో వారికి లాభదాయకం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఎ.సి, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. కొంతమంది మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు.
 
వృశ్చికం :- ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి శుభదాయకంగా ఉంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది. ఆత్మీయుల నుండిసహాయ సహకారాలు లభిస్తాయి. అధిక ఆదాయం కొరకుచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు.
 
ధనస్సు :- రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది.
 
మకరం :- రుణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు తిరిగి సమకూర్చుకుంటారు. దైవదర్శనాలు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం :- ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం తప్పదు. ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలకు బంధువుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసివస్తుంది. కీలక నిర్ణయాలలో కుటుంబీకుల చేయూత లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు.
 
మీనం :- చేనేత, ఖాదీ వస్త్ర పరిశ్రమల వారికి, పనివారలకు ఆశాజనకం. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లిప్తత తప్పవు. భాగస్వామ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకుబరువు బాధ్యతలు అధికం కావటంతో తీరిక, విశ్రాంతి ఉండవు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి.