గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్

20-05-2023 శనివారం రాశిఫలాలు - రమాసమేత సత్యనారాయణస్వామిని...

Weekly astrology
మేషం :- ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి.
 
వృషభం :- ఆర్థికలావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. పెద్దమొత్తం ధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవటం ఉత్తమం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు.
 
మిథునం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారికి లాభదాయకంగా ఉంటుంది. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు.
 
కర్కాటకం :- ప్రతి విషయంలోను మీ వైఖరిని స్పష్టంగా తెలియజేయండి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యం, కుటుంబ విషయాలపై శ్రద్ధవహించండి.
 
సింహం :- ఉద్యోగ బాధ్యతల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిమ్ములను పొగిడే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు సాగిస్తారు. వాహన చోదకులకు చికాకులు అధికం. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనుకూలిస్తాయి. 
 
కన్య :- విద్యార్థులకు విదేశీ విద్యావకాశం లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో హామీలు, సంతకాల విషయంలో జాగ్రత్త అవసరం. కొబ్బరి, పండ్లు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
తుల :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో అంతా అభివృద్ధికరంగా ఉంటుంది. మీకు అనవసర భయాందోళనలు పెరుగుతాయి. కలప, సిమెంటు, ఇసుక రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. విలాసాలకు, ఆడంబరాలకు బాగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- మీ మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లు, నష్టాలను క్రమంగా అధిగమిస్తారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ సమాచారం అందుతుంది. మీ పనులు, వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీల అవసరాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. దంపతుల మధ్య దాపరికం వివాదాస్పదమవుతుంది.
 
మకరం :- ఆత్మవిశ్వసం రెట్టింపవుతుంది. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురయ్యే సూచనలున్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హాడావుడి ఎదుర్కుంటారు. బంధువుల ఆకస్మిక రాకతో ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
కుంభం :- పాడిపశువులు, పెంపుడు జంతువుల విషయంలో ఆందోళన చెందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు ఆశించినంత చురుకుగాసాగవు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతులకు ఇక్కట్లు అధికం. బంధు మిత్రులతో పట్టింపులు, అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. స్టాక్ మార్కెట్రంగాల వారికి సామాన్యం.
 
మీనం :- ఆర్థిక వ్యవహారాల్లో మొహమ్మాటం కూడదు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయాలుతీసుకోవలసి ఉంటుంది. విద్యార్థులకు మంచిగా తెలివి ప్రదర్శించే అవకాశం తక్కువ. సంఘంలోను మీ మాటకు గౌరవం లభిస్తుంది.