గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-05-2023 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం...

astro8
మేషం :- బ్యాంకు పనుల్లో ఆలస్యం ఇతర వ్యవహరాలపై ప్రభావం చూపుతుంది. స్త్రీలకు దంతాలు, నరాలు, కళ్ళకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
 
వృషభం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఉద్యోగస్తులు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. స్త్రీలకు షాపింగుల్లోను, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత ముఖ్యం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
మిథునం :- ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ ప్రమేయం లేకున్నా కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించవలసి వస్తుంది. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
కర్కాటకం :- రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొంతమంది మీ నుండి ధనసహాయం అర్థిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి, ఏజెంట్లకు, బ్రోకర్లకు యాజమాన్యం నుండి ఒత్తిడి పెరుగుతుంది.
 
సింహం :- స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్య లెదుర్కోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాలలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసివస్తుంది. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు.
 
కన్య :- ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వారసత్వపు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు.
 
తుల :- మిమ్మల్ని చూసి అశూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. రావలసిన పత్రాలు, రసీదులు చేతికందుతాయి. మీ అంచనాలు, ఊహలు ఫలిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
వృశ్చికం :- వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. స్త్రీలకు ఉద్యోగం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పారిశ్రామిక రంగాల వారికి, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
ధనస్సు :- మార్కెటింగ్, ప్రైవేటు సంస్థలలోని వారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఉద్యోగ, రుణ యత్నాల్లో కొంత పురోగతి ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 
మకరం :- ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికం. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం వ్యయం చేస్తారు. వాహనం వీలైనంత నిదానంగా నడపటం అతిముఖ్యం.
 
కుంభం :- వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి పురోగతిన సాగుతాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి.
 
మీనం :- వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్ధాలు తలెత్తుతాయి. ప్రయత్నపూర్వకంగానే అనుకున్న పనులు పూర్తి కాగలవు. వాతావరణంలో మార్పువల్ల పెద్దలు స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.