ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-05-2023 శుక్రవారం రాశిఫలాలు - కార్తీకేయుడిని పూజించినా...

astro12
మేషం :- ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. రచయితలకు, కళాకారులకు సదావకాశాలు లభిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుంది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు పురోభివృద్ధి. సన్నిహితుల నుండి అన్ని విధాలా సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి.
 
వృషభం :- దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నం వాయిదా వేయడం మంచిది. స్పెక్యులేషన్ రంగాల వారికి కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. విద్యార్థులకువిద్యా విషయాల్లో ఏకాగ్రత అవసరం.
 
మిథునం :- ఆర్థిక సమస్యల నుంచి విముక్తులవుతారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరం. కొంతమంది మీ నుంచి సమాచారం సేకరించటానికి యత్నిస్తారు. స్త్రీల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ప్రియతముల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
కర్కాటకం :- వ్యాపారాలు, స్థిరచరాస్తుల అభివృద్ధికై చేయుకృషిలో సఫలీకృతులౌతారు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. ప్రయాణాలలో సంతృప్తి కానరాదు.
 
సింహం :- వృత్తుల వారికి సామాన్యం. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ జీవితభాగస్వామి సలహా పాటిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలిస్తాయి. పారిశ్రామికరంగాల వారికి కార్మికులతో చికాకులు తప్పవు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
కన్య :- దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అకాల భోజనం, విశ్రాంతిలోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే ఆస్కారం ఉంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురువుతాయి.
 
తుల :- సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ నుండి కొంత మంది ధనసహాయం ఆశిస్తారు. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. భాగస్వామిక చర్చలు, కోర్టు వ్యవహరాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
ధనస్సు :- స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపక స్వయంకృషినే నమ్ముకోవటం మంచిది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది.
 
మకరం :- టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
కుంభం :- దైవ, సేవా, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యత వల్ల మనస్సు నిలకడగా ఉండదు. ఏ.సి, కూలర్లు, ఇన్వెర్డేర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు.
 
మీనం :- శత్రువులు మిత్రులగా మారి సహాయం అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు.