గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (08:31 IST)

01-06-2023 గురువారం రాశిఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన శుభం..

Gemini
మేషం :- వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. నిరుద్యోగులలో నూతనోత్సహం చోటుచేసుకుంటుంది.
 
వృషభం :- కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మిత్రుల తీరు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. సానుకూలమైన మార్పుతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది. చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలు మించుతాయి.
 
మిథునం :- ఆర్థిక విషయాలలో కష్టనష్టాలు సంభవం. బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఆస్పత్రి బిల్లులు, భీమా, గ్రాట్యుటీ వ్యవహారాల్లో అవాంతరాలు తప్పక పోవచ్చు. విద్యార్థులకు ఒత్తిడి, మానసికాందోళన తప్పవు.
 
కర్కాటకం :- ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహనకు వస్తారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉమ్మడి నిధుల నిర్వాహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. మిత్రులవల్లసమస్యలు ఎదురయ్యే అవకాశంఉంది.
 
సింహం :- లీజు, ఏజెన్సీలు. నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. కార్యాసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. పోటీలు. ప్రత్యర్థుల కదలిక పట్ల ఓ కన్నేసి ఉంచండి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి.
 
కన్య :- రుణ యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. స్త్రీలు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నాలు చేస్తారు. కంపెనీలకు అవసరమైన నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
తుల :- వృత్తి, వ్యాపారాలకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. క్రయ విక్రయాలకు తగిన సమయం కాదు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. దూరంలో ఉన్న వ్యక్తులు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- స్త్రీలకు వస్త్ర, వస్తులాభం ఉంటాయి. పొదుపు పథకాలు, చిట్‌ఫండ్ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కొత్తగా చేపట్టిన పనులు నిలకడగా సాగుతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- బంధువుల రాకపోకలుంటాయి. ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఆర్థికపరమైన చర్చలకు అనుకూలం. వ్యాపారంలో ఆశించినంత ప్రయోజనాలు సాధించడం కష్టం. పెద్దల సహకారం లోపిస్తుంది.
 
మకరం :- గృహావసరాలకు నిధులు సమకూరుతాయి. బంధు మిత్రులతో సమావేశం ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్ధులలో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. షాపింగులో దుబారా ఎక్కువగా ఉండే అవకాశంఉంది. సంకల్పం ఫలిస్తుంది. పారితోషికాలు అందుకుంటారు. ప్రకటనలు, న్యాయ, బోధనారంగాల వారికి అనుకూలం.
 
కుంభం :- పెన్షన్, భీమా పనులు పూర్తవుతాయి. జన సంబంధాలు మెరుగుపడతాయి. దూరంలోవున్న బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం అందుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దూరంగా ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
మీనం :- స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మీకు ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.