శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-06-2023 గురువారం రాశిఫలాలు - కుబేరుడిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం...

Libra
మేషం :- ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది.
 
వృషభం :- రాజకీయ నాయకులకు కలిసివచ్చును. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ కృషికి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ప్రయాణ రీత్య ధనవ్యాయం మానసిక ప్రశాంతత కరువగును.
 
మిథునం :- ఏజెన్సీ, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. షేర్ల అమ్మకం కంటె కొనుగోళ్ళే లాభదాయకం. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. 
 
కర్కాటకం :- ఇతరులకు మేలు చేసినా విమర్శలు తప్పవు. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. మీ శ్రమకు లభించిన ప్రతిఫలంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రాజీ మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి.
 
సింహం :- స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. విద్యార్ధినులకు ఉన్నత విద్యలలో అవకాశం లభిస్తుంది. స్త్రీలకు ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. బంధు మిత్రుల రాక పోకలు చికుకుపరుస్తాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పరిచయం ఉన్న వ్యక్తుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు.
 
కన్య :- స్త్రీలకు షాపింగుల్లోను, స్కీంల పట్ల అవగాహన అవసరం. ఉద్యోగస్తులకు కొత్త అధికారులు, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ప్రయాణాలు ఆశించినంత ఉత్సాహంగా సాగవు.
 
తుల :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. మీ జీవితభాగస్వామి సలహా పాటించటం మంచిది. భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహించండి. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశానికి ప్రయాణం చేయాల్సివస్తుంది.
 
ధనస్సు :- ఆర్థికంగా పురోగమించటానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. మీ సంతానం ఉన్నత విద్యల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. అనుకున్న పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
మకరం :- మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యంలో జాగ్రత్త వహిస్తారు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీల తెలివితేటలకు మంచిగుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు.
 
కుంభం :- పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఒక్కోసారి మీ జీవితభాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
మీనం :- చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించకపోవటం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు.