గురువారం, 17 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 ఏప్రియల్ 2025 (10:06 IST)

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

rain
ఈసారి నైరుతి సీజన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత యేడాది కోస్తాలో శ్రీకాకుళం, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాభావం కొనసాగింది. అయితే, ఈసారి మాత్రం ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ వెల్లడించింది. 
 
ఈ యేడాది జూన్- సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. వరుసగా రెండో యేడాది కూడా నైరుతి సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపింది. దీర్ఘాలిక సగటు 87 సెంటీమీటర్లు కాగా, వర్షపాతంతో పోలిస్తే ఈసారి ఇది 105 శాతం వర్షాలు కుస్తాయని పేర్కొంది. అయితే, ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసినప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాలకు అది సమానంగా ఉండే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.