1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana braces for scorching summer as IMD predicts above-normal temperatures

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

Summer
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఎండలు మండిపోనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ హెచ్చరిక చేసింది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని తెలిపింది. 
 
ప్రధానంగా ఆసిఫాబాద్, ములుగు, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, పాలమూరు, హన్మకొండ, వరంగల్, నల్గొండ, జనగాం, యాదాద్రి భవనగిరి జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని హెచ్చరించింది. కాగా, బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురంలో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 
తర్వాతి కథనం
అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)