1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. Telangana LAWCET & ECET 2025 Exam Schedule Release

తెలంగాణాలో లాసెట్ నోటిఫికేషన్ రిలీజ్!!

telangana high court
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2025-26 విద్యా సంవత్సరానికిగాను రెండు కోర్సులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లా సెట్‌, ఈ సెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే రాత పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ మేరకు శనివారం ఈ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీచేసింది. లా సెట్‌కు మార్చి ఒకటో తేదీ నుంచి, ఈ సెట్‌కు మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. 
 
ఇంటర్ విద్యార్హతపై ఐదేళ్ల ఎల్ఎల్బీ, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ నిర్వహిస్తారు. ఈసారి పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షల్లో సిలబస్‌ను స్వల్పంగా మార్పు చేశారు. 
 
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) పూర్తి చేసిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు. 
 
ప్రవేశ పరీక్షల దరఖాస్తు షెడ్యూల్ ఇలా..
టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 25
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం - మార్చి 1
దరఖాస్తుల చివరి తేదీ - ఏప్రిల్ 15.
అలస్య రుసుముతో మే 25 పరీక్ష తేదీ : జూన్ 6
 
టీజీ ఈసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 25 
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - మార్చి 3 
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ - ఏప్రిల్ 19 
పరీక్ష తేదీ : మే 12 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన భార్య... వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త!