సంబంధిత వార్తలు
- అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!
- ప్రేమించి పెళ్లాడి నిన్నే వేధించినవాడు.. నన్నెలా లాలిస్తాడమ్మా?
- ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలకు భయపడి కారులో ప్రేమ జంట ఆత్మహత్య!!
- చాలా చాలా చిన్న కారణం, తనకు విషెస్ చెప్పలేదని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని
- బైక్‌తో పాటు బావిలో దూకేసిన వ్యక్తిని రక్షించబోయి.. నలుగురు మృతి
పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ ఠాణా పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన 21 రోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్ర నగర్ పోలీసుల కథనం మేరకు...మాదాపూర్‌కు చెందిన రాకేష్ గౌడ్ (28)కు తమ దగ్గరి బంధువైన కర్నూలుకు చెందిన యువతితో గతేడాది డిసెంబరు 14న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ దంపతులిద్దరూ కలిసి రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని హైదర్‌గూడలో నివాసముంటున్నారు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం రాకేష్ భార్య విధులకు వెళ్లగా, రాకేష్ మాత్రం ఇంట్లో ఉన్నాడు. రాత్రి 8.30గంటల సమయంలో భర్తతో ఫోనులో మాట్లాడి, రాత్రి 11 గంటలకు ఆమె విధుల నుంచి తిరిగి వచ్చేసరికి రాకేష్ ఇంట్లో ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అతడి మృతికి కారణాలు తెలియరాలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
డబ్బంతా సజ్జల భార్గవ రెడ్డే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసారు. ప్రస్తుతం ఆయన వద్ద కోర్టు అనుమతితో విచారణ జరుపుతున్నారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సాథ్యంలోని పోలీసులు బుధవారం కడప సెంట్రల్ జైలు నుంచి వర్రాను సైబర్ స్టేషన్‌కు తరలించి విచారించారు.
'సజ్జల భార్గవ రెడ్డి, రామకృష్ణా రెడ్డి సూచనల మేరకే పోస్టులు పెట్టాం. మాకు డబ్బులు ఇవ్వలేదు. మా పేరు చెప్పి సజ్జల భార్గవ రెడ్డి సొమ్ములు కొట్టేశారు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడంతో పోస్టులు పెట్టాను. అయితే, వీటిలో 18 నావి కాదు. నా పేరిట ఫేక్ ఖాతాలు సృష్టించి పోస్టులు పెట్టారు' అని విచారణలో వర్రా చెప్పినట్లు తెలిసింది.
కాగా, వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, ఆయన తండ్రి, అప్పటి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి చెబితేనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్టు చెప్పారు. వారి ప్రోద్బలంతోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనిత, షర్మిల, విజయలక్ష్మి ఇతరులపై అసభ్య పోస్టులు పెట్టామని వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కోకన్వీనర్ వర్రా రవీంద్రా రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
