తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)
తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విధులు కేటాయించిన పోలీసు అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారంటూ నిలదీశారు. ఇది క్షమించాల్సిన తప్పుకాదన్నారు. టిక్కెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి టిక్కెట్లు పంపిణీ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారని అడిగారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఎన్ని టిక్కెట్లు జారీ చేశారు, ఘటనా స్థలానిక అంబులెన్స్‌లు ఎన్ని గంటలకు చేరుకున్నాయంటూ వరుస ప్రశ్నలు సంధించడంతో జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పలేక బిక్కమొహం పెట్టారు.
ఇది పద్దతి కాదు. పద్దతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి. మీరు సమాధానం చెప్పిండి. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు. ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. పద్దతి ప్రకారం నడుచుకోండి. తమాషాలనుకోవద్దు. బాధ్యతలు తీసుకున్నపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నో ఎక్స్‌క్యూజ్. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. ఎందుకు జరిగిందో చెప్పండి. భక్తులను ఉంచేందుకు కొత్త ప్లస్ ఎంపిక చేసుకున్నపుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక్కడ నియమించిన పోలీస్ అధికారికి జాగ్రత్తలు చెప్పారా. ఆ గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు అంటూ కలెక్టర్, ఎస్పీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు నిర్లక్ష్యం చేశారు? మీ పై నమ్మకం పెడితే ఇదేనా బాద్యత వహించడం? తిరుపతి ఎస్పికి ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్... చివర్లో మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి!!