చాలా చాలా చిన్న కారణం, తనకు విషెస్ చెప్పలేదని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని
ఇటీవలి కాలంలో టీనేజ్ యువతీయువకులు చాలా చాలా చిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి విషాదకర ఘటన ఒకటి జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా తన స్నేహితురాలు తనకు విషెస్ చెప్పలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది.
పూర్తి వివరాలు చూస్తే... అనంతపురం జిల్లా పాల్తూరులో 17 ఏళ్ల చిన్న తిప్పమ్మ ఓ ప్రైవేట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతోంది. ఆమె మొదటి సంవత్సరం చదివేటపుడు ఓ స్నేహితురాలు ప్రస్తుతం ఈమెకి కాస్త దూరంగా వుంటోంది. ఆమెను పలుకరిద్దామని ప్రయత్నిస్తున్నా ముఖం చాటేస్తుండటమే కాకుండా బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా తనకు విషెస్ చెప్పలేదనే ఆవేదనతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
ఈ విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కుమార్తె ఇలా బలవన్మరణం చెందడంపై తల్లడిల్లుతున్నారు. కాగా ఇలాంటి చిన్నచిన్న కారణాలకే పిల్లలు ఇలా ప్రాణాలు తీసుకోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.