పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పరిధిలో పట్టపగలు ఓ దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తుండగా తండ్రిని కన్నకొడుకు కత్తితో పొడిచి చంపేశాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు...
సికింద్రాబాద్ద లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) అనే వ్యక్తికి కుమారుడు సాయి కుమార్ (25) ఉండగా, వీరిద్దరూ కలిసి ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పని చేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తుండటంతో సాయి కుమార్ విసిగిపోయాడు.
శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా, అతని కుమారుడు బైకుపై అనుసరించాడు. ఈసీఐఎల్ బస్ టర్మినల్ వద్ద బస్సు దిగిన తండ్రిని తన వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణా రహితంగా 10, 15 సార్లు పొడిచాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తండ్రిపై కుమారుడు కత్తితో దాడి చేస్తున్న దృశ్యాసలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సాయి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.