గురువారం, 20 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (21:40 IST)

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

crime
హైదరాబాద్ నగరంలోని మేడ్చల్‌లో దారుణం జరిగింది. పట్టపగలు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డారు. సినిమా తరహాలో పోటు మీద పొడుస్తూ నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగా, ఎలాంటి భయం లేకుండా దారుణంగా నరికి చంపేశారు. దీంతో మేడ్చల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 
 
వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఉమేష్ (25) అనే వ్యక్తిని నడి రోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. రోడ్డుపై వాహనాలు వెళుతుండగానే పట్టపగలు, అందరూ చూస్తుండగా పోటు మీద పోటు పొడుస్తూ అతి కిరాతకంగా చంపేశారు. ఎవరన్న చూస్తారన్న ఏమాత్రం భయం లేకుండా పొడిచి చంపి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.