శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ ఐ|| చతుర్ధశి తె.4.05 మఘ రా.2.36 ప.వ. 1.18 ల 3.04. 3.5.11.33 12.23.
గాయిత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
మేషం :- వస్త్ర, ఫ్యాన్సీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవదీక్షలు, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మాటతొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు.
వృషభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన మార్పులు వాయిదా పడగలవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. గతంలో చేజారిన పత్రాలు చేతికందుతాయి. నిర్మాణాత్మక పనుల్లో ఏకాగ్రత అవసరం. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఊహించని రీతిలో ధనలబ్ధి పొందుతారు.
మిథునం :- విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయటం మంచిది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. నిరుద్యోగులకు స్థిరమైన అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం :- స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆశయ సాధన కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యాపారాలు అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఉపాధ్యాయులు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ సంతానం వివాహ, ఉద్యోగ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
సింహం :- ఆర్థిక విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి పథకాలు వేస్తారు. వాతావరణ ప్రతిబంధకాలు, శ్రమాధిక్యత తప్పవు. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండగలదు. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తత అవసరం. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించండి.
కన్య :- మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళకువ ఏకాగ్రత అవసరం. విదేశీయానం, రుణయత్నాలు ఫలిస్తాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందు లెదురవుతాయి.
తుల :- మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ముఖ్యులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఫైనాన్స్, చిట్ ఫండ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
వృశ్చికం :- ద్విచక్ర వాహనం పై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులు పై అధికారుల నుంచి బహుమతులు స్వీకరిస్తారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు.
ధనస్సు :- హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొంతమంది మీ నుంచి ధనం ఆశిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
మకరం :- బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ప్రముఖులను కలుసుకుంటారు. రవాణా రంగాలవారికి ప్రయాణికుతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
కుంభం :- వ్యాపారాల్లో మొహమ్మాటంవీడి లౌక్యం ప్రదర్శించండి. ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కుంటారు. సభలు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.స్త్రీలు షాపింగులోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటంమంచిది.
మీనం :- రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. దైవ, సేవా, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలందిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ట్రాన్స్పోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.