గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-09-2023 శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించినా సర్వదా శుభం

Astrology
శ్రీ శోభకృత నామ సం|| నిజ శ్రావణ బ॥ దశమి రా.9.08 ఆరుద్ర సా.5.27 వర్జ్యం లేదు. ఉ.దు. 5.48 ల 7.28.
 
మేషం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఏ పని తలపెట్టినా జయం చేకూరుతుంది. సేవా, పుణ్యకార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృషభం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. మీ శ్రీమతి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. 
 
మిథునం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు.
 
కర్కాటకం :- స్త్రీలు టి.వి, ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సందర్భానుసాకూలంగా సంభాషించుటం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.
 
సింహం :- ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరీ సోదరుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు.
 
కన్య :- పాత రుణాలు తీరుస్తారు. బంధు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది.
 
తుల :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విదేశీ ప్రయాణాలలో అడ్డంకులు తొలగిపోతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.
 
వృశ్చికం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటంతో మానసిక సంతృప్తి పొందుతారు. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యుల కోసం విరివిగా ధనవ్యయం చేస్తారు.
 
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. విద్యుత్, రవాణా రంగాలలోని వారికి చికాలు అధికమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మకరం :- చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కొంటారు.
 
కుంభం :- బంధువులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. దైవదర్శనం అతికష్టంమ్మీద అనుకూలిస్తుంది. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి.
 
మీనం :- స్త్రీలకు పనివారితో చికాకులు, ఇబ్బందులు తాత్కాలికమే. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఖర్చులు భారమనిపించవు. అయిన వారే సాయంచేసేందుకు వెనుకాడుతారు. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి.