గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-09-2023 బుధవారం రాశిఫలాలు - శ్రీ కృష్ణుని ఆరాధించిన శుభం...

simha raasi
శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ ఐ|| సప్తమి రా.8.07 కృత్తిక ప.2.43 వర్ణ్యం లేదు. 
 
మేషం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
వృషభం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. వ్యవసాయ కూలీలకు, భవన కార్మికులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన అవసరం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు రావలసిన క్లయింలు, అలవెన్సులు ఆలస్యంగా అందుతాయి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీయాన, రుణయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితుల అనుకూలతలు ఉంటాయి.
 
సింహం :- మీ మాటకు గృహంలో అందరూ కట్టుబడి ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు వంటి శుభ ఫలితాలుంటాయి. హోల్సేల్ వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
కన్య :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభించదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు.
 
తుల :- పోస్టల్, టెలిగ్రాఫిక్ రంగాల వారికి సంతృప్తి నిస్తుంది. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆదర్శభావాలు కల వ్యక్తులు పరిచయం మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది.
 
వృశ్చికం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచనమంచిది. వృత్తుల వారికిశ్రమ అధికం ఆదాయం స్వల్పంగా ఉంటుంది. విందులలో పరిమితి పాటించండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు :- సినిమా, కళా రంగాల్లో వారికి మార్పులు అనుకూలంగా ఉంటాయి. ఋణం ఏ కొంతైనా తీరుస్తారు. విద్యార్థునులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి. కోర్టు, వ్యవహారాలు, పాత సమస్యలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మెప్పు కోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు.
 
మకరం :- ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతుంది. మీ కుటుంబీకులు మీ మాటా, తీరును వ్యతిరేకిస్తారు.
 
కుంభం :- మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. అనుకోని ఖర్చులు, చెల్లింపుల వల్ల ఇబ్బందులు తప్పవు. రుణాల కోసం అన్వేషిస్తారు. సోదరులకుమీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం :- ముఖ్య విషయాల్లో మీ జీవిత భాగస్వామి సలహా, సహకారం తీసుకోవటం మంచిది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. దైవసేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పారిశ్రామిక కార్మికులకు మధ్య పరస్పర అవగాహన లోపం.