గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-09-2023 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని తమలపాకులతో ఆరాధిస్తే...

Karkatam
మేషం :- ఉపాధ్యాయులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో రాణిస్తారు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దైవ దర్శనాలు అనుకూలం. ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి.
 
వృషభం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. ప్రయాణాలు, మీ కార్యక్రమాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తులు నూతన హోదాలు పొందే ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు లౌక్యం అవసరం.
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది తప్పక పోవచ్చు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. వాతావరణంలో మార్పు వల్ల చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
 
కర్కాటకం :- రాజకీయనాయకులు కీలకమైన పదవులు, బాధ్యతలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. తెలివిగా అడుగు వేస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. వ్యాపారాల్లోనష్టాలు, ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు.
 
సింహం :- సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. పెద్దలతో సంభాషించేటపుడు మెళకువ వహించండి.
 
కన్య :- ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. కళ, క్రీడ సాంకేతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. క్రయవిక్రయాలు సామాన్యం.
 
తుల :- హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. దీర్ఘకాలిక, ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా భర్తీ కాగలదు. ప్లీడర్లకు పురోభివృద్ధి, వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి సామాన్యం. మీ మాటలు ఇతరులకు చేరే వేసే వ్యక్తుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి,దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
ధనస్సు :- నిరుద్యోగులు ఉపాధి పథకాలలో నిలదొక్కుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. శ్రమాధిక్యత ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం, సోదరుల నుండి ఆదరణ పొందుతారు. ధనం, వస్తువులపై అధిక ఆపేక్ష వల్ల బంధు మిత్రులకు దూరం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి.
 
మకరం :- వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి. బ్యాంకు పనులు మొక్కుబడిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
 
కుంభం :- ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్ధంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మిమ్మల్ని ఉద్రేకపరిచి కొంతమంది లాభపడటానికి యత్నిస్తారు మెళకువ వహించండి.
 
మీనం :- చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఆస్తి వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ప్రముఖులను కలుసుకుంటారు. పనులు క్రమేపి వేగవంతమవుతాయి. ఆలయాలు, సేవ సంస్థలకు సహాయం అందిస్తారు.