శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (09:14 IST)

31-08-2023 గురువారం రాశిఫలాలు - గురుచరిత్ర పారాణయం చేసి...

Pisces
మేషం :- వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమపడవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి.
 
వృషభం :- ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మిత్రులను కలుసుకుంటారు.
 
మిథునం :- ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమయినదని గమనించండి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దంపతుల మధ్య అపార్థాలు తలెత్తుతాయి. అపార్ధాలు మాని ఇతరులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు సాఫీగా జరుగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రయాణాలు అనుకూలం. భావోద్వేగాలు ప్రముఖపాత్ర వహిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. బంధుత్వాల మధ్య ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులు తీరిపోతాయి.
 
కన్య :- ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, వస్త్రలాభం, వాహన యోగం వంటి శుభ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు మేలు చేసినా అపవాదులపాలవుతారు. మీకున్న కళానైపుణ్యతలను ఇతరులు మెచ్చుకునేలా చక్కగా ప్రదర్శిస్తారు.
 
తుల :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి, ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. రాజకీయనాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. నిరుద్యోగులకు కలిసివచ్చేకాలం.
 
వృశ్చికం :- వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాంట్రాక్టులు చివరిలో దక్కుతాయి.
 
ధనస్సు :- ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు సంభవిస్తాయి. ఆస్తి వ్యవహరాల్లో దాయాదులతో జాగ్రత్తగాత వ్యవహరించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.
 
మకరం :- స్వయంకృషితో రాణిస్తారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. క్రమంగా అన్నివిధాలా చురుగ్గానూ, ఉత్సాహంగానూ జరుగుతాయి. ఉద్యోగస్తులు, ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా నడుస్తాయి. భాగస్వామిక చర్చలు వాయిదాపడుట మంచిదని గమనించండి. బంధువులతో సత్సంబంధాలు నెల కొంటాయి.
 
మీనం :- స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింతముందు కెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. మీ ఆలోచనా దృష్టిని మరికాస్త పెంపొందించుకోండి. బ్యాంక్ ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అనుకూలిస్తుంది. హోటలు, తినుబండ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.